నేడు బ్యాక్ లాగ్ పోస్టుల ఫలితాలు
1, 2 తేదీల్లో బ్యాక్ లాగ్ పోస్టుల
ధ్రువపత్రాల పరిశీలన
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల
విద్యాలయాల సంస్థలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల నియామకాల
ధ్రువపత్రాల పరిశీలన సెప్టెంబర్ 1, 2 తేదీల్లో
నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి బి.నవ్య సోమవారం తెలిపారు. సాంఘిక సంక్షేమ
గురుకుల విద్యాలయాల్లో ప్రత్యక్ష నియామకం ద్వారా ప్రిన్సిపాల్ (గ్రేడ్-2)-1,
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ)-38,
కేర్ టేకర్ (వార్డెన్స్)-7 ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీ
ప్రక్రియ తుది దశకు వచ్చిందని తెలిపారు. అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన ముందుగా
ఆగస్టు 25, 26 తేదీల్లో జరగాల్సి ఉందని, దాన్ని సెప్టెంబర్ 1, 2 తేదీలకు మార్పు
చేసినట్లు తెలిపారు. ఇందుకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను website లో పొందుపరిచామన్నారు. అర్హులైన అభ్యర్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబరు
సంక్షిప్త సందేశం పంపినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్య ర్థులు తమ ధ్రువపత్రాలతో
సెప్టెంబర్ 1, 2 తేదీల్లో తాడేపల్లిలోని ఏపీ సాంఘిక
సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయానికి రావాలని సూచించారు.
Results : Click Here 1, Click Here 2
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time