ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడిట్ ఆన్లైన్ ప్రవేశాల నమోదు గడువు పెంపు
ఇంటర్ తొలి దశ ఆన్ లైన్ ప్రవేశాల నమోదు
గడువును ఈ నెల 27 వరకూ పొడిగిస్తున్నట్లు ఇంటర్ విద్యా
మండలి వెల్లడిం చింది. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ నమోదు చేసుకోవచ్చని, విద్యార్థులు, తల్లిదండ్రులకు సందేహాలుంటే 18002749868
టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని సోమవారం ఓ
ప్రకటనలో సూచిం చింది. ఆన్లైన్ దరఖాస్తు కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాం గులు రూ.50, ఓసీ, బీసీ కేటగిరీ విద్యార్థులు రూ. 100 చెల్లించాలని స్పష్టం చేసింది. ఇంటర్-2021లో మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన
అవసరం లేకుండా పరీక్షలకు హాజరుకా వొచ్చని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఒకటి
కన్నా ఎక్కువ సబ్జెక్టులున్నా ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, కళాశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించా లని సోమవారం ఓ ప్రకటనలో
తెలిపింది.
Apply Online : Click Here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time