19, ఆగస్టు 2021, గురువారం

గేట్.. గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ - 2022

గేట్.. గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ - 2022

గేట్.. గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్! ఐఐటీలు, ఎఐటీలు, ఇతర ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో.. ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచీ తదితర కోర్సుల్లో.. ప్రవేశానికి తొలి మెట్టు! అంతేకాదు గేట్ స్కోర్తో ప్రభుత్వ రంగ సంస్థల్లో.. కొలువులు సైతం సొంతం చేసుకోవచ్చు. అందుకే.. ప్రతి ఏటా గేటు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. తాజాగా గేట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల(ఆగస్టు) 30న ప్రారంభం కానుంది.

గేట్-2022లో పలు మార్పులు జరిగాయి. ముఖ్యంగా కొత్తగా రెండు పేపర్లను చేర్చారు. అవి.. నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్; జియోమాటిక్స్ ఇంజనీరింగ్. దీంతో గేట్ లో మొత్తం సబ్జెక్ట్ పేపర్ల సంఖ్య 29కి చేరింది. వీటిలో ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. రెండు పేపర్లకు హాజరు విధానాన్ని గేట్-2021 నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చారు. అనుమతించిన (రెండు పేపర్ల కాంబినేషన్) జాబి తా నుంచి అభ్యర్థులు తాము రాయాల్సిన పేపర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండు పేపర్లకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు.. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది.

గేట్-2022 సమాచారం :

Ø  దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Ø  ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 30, 2021

Ø  ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2021

Ø  గేట్ పేపర్ మార్పు , కేటగిరీ, పరీక్ష కేంద్రం మార్పునకు చివరి తేదీ: నవంబర్ 12, 2021

Ø  గేట్-2022 ఆ న్లైన్ పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో రోజుకురెండు స్లాట్లలో పరీక్ష ఉంటుంది.

Ø  గేట్ పరీక్ష ఫలితాల వెల్లడి: మార్చి 17, 2022

Ø  తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవా డ, అనంతపురం, కర్నూలు, ఏలూరు, కాకినా డ, మచిలీపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం,విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం , కోదాడ, వరంగల్.

Apply Online: Click Here

Eligibility: Click Here

Requirements : Click Here

Notification: Click Here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

I you have any query comment me, Ask me , I will try to respond any time

Most Popular Posts